🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 27 Aug, 2026 | Page: 1

బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ‘తీజ్’ ఉత్సవం

హనుమకొండ: బంజార జాతి గర్వించే ఘనమైన పండుగ తీజ్ ఉత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని గిరిజన భవన్‌లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు బంజారా సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తీజ్ ఉత్సవాలు బంజారా సమాజంలో ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో NSR గ్రూప్స్ చైర్మన్ నాగినేని సంపత్ రావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, బంజారా సోదర సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home