🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 27 Aug, 2026 | Page: 1

డీసీసీ అధ్యక్షుడు ఇనగాలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

హనుమకొండ: రక్షాబంధన్ మహోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ సోదరీమణులు రాఖీ కట్టారు. హనుమకొండ రామకృష్ణ కాలనీ లోని ఆయన నివాసానికి విచ్చేసిన బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించి రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పరమాత్మ శివబాబా ఈశ్వరీయ ఆశీస్సులు, ప్రసాదాన్ని అందజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు.
🏠 Home