🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 28 Aug, 2026 | Page: 1

వరంగల్‌లో ఘనంగా జంధ్యా ధారణ కార్యక్రమం

వరంగల్: పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు డి.ఎస్. మూర్తి ఆధ్వర్యంలో వరంగల్ సాయిబాబా ఆలయ ఆవరణలో జంధ్యా ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి కులబంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని జంధ్యా ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ.. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవడంతో పాటు, భవిష్యత్ తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజ ఐక్యత కోసం ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీందర్, వడ్నాల నరేందర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్ బాబు, గోరంటల రాజు, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, శ్రీనివాస్, రాజకుమార్, క్రాంతి, ఆంజనేయులు, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి కులబంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినారు
🏠 Home