శ్రావణమాసం శ్రావణ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది ఇది ఉపనయనం
శ్రావణమాసం శ్రావణ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది ఇది ఉపనయనం అయిన వారి ఉపాకర్మ సంస్కారాలకు, వేదాధ్యయనానికి అనువైన రోజు, జంద్యాల పౌర్ణమి గానూ ప్రసిద్ధి చెందింది. ఇదే రోజున దేశమంతా రక్షా బంధన ఉత్సవాన్ని జరపుకోవడం సాంప్రదాయం గత 4,5 సంవత్సరాలనుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని "జయశ్రీ హాస్పిటల్ " కమ్యూనిటీ హాల్ లో ప్రతి ఆదివారం ఉదయం ఆర్య సమాజం ఆధ్వర్యంలో దైవ యజ్ఞం డాక్టర్ వాసవాచారి సహాయ సహకారం తో నిర్వహించడం జరుగుచున్నది. శ్రావణ మాసం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం సంధర్భంగా ప్రతిరోజూ యజ్ఞం కార్యక్రమం అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కోమటి బండ వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు నిగమ్ నిడం వేద పండితులైన బ్రహ్మచారులు దైవ యజ్ఞం నిర్వహించారు. అలాగే యజ్ఞం పాల్గొన్న వక్తలు కిష్టారెడ్డి, కొండలు రెడ్డి, మల్లికార్జున్, నరేందర్ రెడ్డి వేదాల్లో చెప్పబడిన బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాస ఆశ్రమం గురించి వివరించారు. కార్యక్రమం లో యజ్ణోపవితధారణ మరియు రక్షాబంధన్ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. చిల్వేరు బలరాం,విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
వార్త -1
ఓవర్
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఫ్రీలాన్స్ సీనియర్ జర్నలిస్ట్ వంగాల రంగాచారి.
వార్త -1
ఓవర్
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఫ్రీలాన్స్ సీనియర్ జర్నలిస్ట్ వంగాల రంగాచారి.