🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 28 Aug, 2026 | Page: 1

హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి రాఖీ కట్టిన చిన్నారులు

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని బాలసముద్రంలోని 'మల్లికాంబ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ అండ్ డిసేబిలిటీస్' ఆశ్రమానికి చెందిన చిన్నారులు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు రాఖీలు కట్టి తమ సోదరభావాన్ని చాటుకున్నారు. వెంకట్రామ్ రెడ్డి చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారితో కాసేపు సమయం గడిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, బహుమతులు అందజేశారు. ఆశ్రమ నిర్వాహకులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
🏠 Home