కాజిపేట్ ట్రాఫిక్ పోలీస్ ల చొరవతో పోగొట్టుకున్న బ్యాగ్ ను బాధితుడికి అప్పగింత..
గౌతమ్ అను వ్యక్తి తన పిల్లలతో కాజిపేట్ లో ఆటో ఎక్కి అంబేద్కర్ సెంటర్ లో దిగి తమ యొక్క బ్యాగ్ ను కొన్ని విలువైన వస్తువులను ఆటోలోనే మరచిపోయారు. ఇట్టి విషయమును అక్కడ డ్యూటీ చేస్తున్న కాజిపేట్ ట్రాఫిక్ పీస్ సిబ్బందికి తెలియచేయగా, కాజిపేట్ ట్రాఫిక్ పీస్ సిబ్బంది అయిన ప్రసాద్, చంద్రబోస్ చొరవతో ఆటో డ్రైవర్ Md. మోసిన్ అట్టి బ్యాగ్ ను గుర్తించి బ్యాగ్ పోగొట్టుకున్నటువంటి వారిని పిలిపించి బ్యాగ్, ఇతర వస్తువులను వారికీ అందచేయడం జరిగింది. ఆటో డ్రైవర్ అయిన Md. మోసిన్ ను మరియు కాజిపేట్ ట్రాఫిక్ పీస్ సిబ్బంది ని కాజిపేట్ ట్రాఫిక్ పీస్ ఇన్స్పెక్టర్ పిట్టల వెంకన్న గారు అభినందించారు.