హన్మకొండ దళిత మహాసభను విజయవంతం చేయాలి
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, ఆగస్టు 27:
ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ దళిత మహాసభను విజయవంతం చేయాలని పర్వతగిరి మండల కాంగ్రెస్ దళిత విభాగం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభకు టీపీసీసీ దళిత విభాగం రాష్ట్ర చైర్మన్ కవ్వంపాటి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే తదితర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్, వరంగల్ జిల్లా దళిత విభాగం చైర్మన్ సిలువేరు శ్రీనివాస్, వరంగల్ జిల్లాసీనియర్ నాయకులు పిన్నింటి అనిల్ రావు పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అనుమతి మేరకు పర్వతగిరి మండల ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ నరుకుడు రవీందర్ ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హన్మకొండకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో పాల్గొని దళిత మహాసభను విజయవంతం చేయాలని నరుకుడు రవీందర్ కోరారు.
దళిత విభాగాల సంబంధించిన ప్రజాప్రతినిధులు సర్పంచులు వార్డ్ మెంబర్లు సొసైటీ చైర్మన్లు ఎంపీటీసీలు తరలివచ్చి సభను విజయవంతం చేయగలరని కోరారు