సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ గారికి ఎల్.ఓ.సీ ద్వారా ఉచిత వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్న డిసిసి అధ్యక్షుడు అయూబ్
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వనం భాస్కర్ గారి ఆరోగ్యం క్షీణించడంతో, ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనం భాస్కర్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు. వెంటనే స్పందించి, ఆయనకు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేడు ఎల్.ఓ.సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా ఉచితంగా వైద్యం అందే విధంగా అవసరమైన చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులతో సమన్వయం చేశారు...
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు మాట్లాడుతూ, సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు...
వనం భాస్కర్ గారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఆయనకు అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని మహమ్మద్ అయూబ్ గారు తెలిపారు.