🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 29 Aug, 2026 | Page: 1

డెంగ్యూ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామంలో డెంగ్యూ వ్యాప్తించకుండా దోమల నివారణ కోసం పిచికారి చేయించిన గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్

జన చరిత్ర న్యూస్ వర్ధన్నపేట , ఆగష్టు 29
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో డెంగ్యూ మలేరియా పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జ్వరం బారిన పడినటువంటి కుటుంబాల ఇంట్లోకి వెళ్లి దోమల నివారణ కొరకై టేమోపాస్ ఫైర్ట్రీన్ పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ వైద్యాధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రస్తుత సీజనల్ వ్యాధులు మరియు గ్రామంలో ప్రజలకు జ్వరాలు వస్తున్న క్రమంలో ప్రజలు తమ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జ్వరం రాగానే వైద్య అధికారులను సంప్రదించాలని డెంగ్యూ మలేరియా వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి షేక్ హుస్సేన్ వైద్యాధికారులు సబ్ యూనిట్ ఆఫీసర్ యాదయ్య హెల్త్ అసిస్టెంట్ శ్యామ్ ప్రేమ్ ప్రసాద్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
🏠 Home