🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 29 Aug, 2026 | Page: 1

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు.-పాల్గొన్న మండల అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి,ఆగస్టు29 :*

పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు శనివారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మాసాని మరియా, ధమిషెట్టి రాజు, రౌతు వీరస్వామిలు మరణించగా వారి నివాసాలకు వెళ్లి మృతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి, గ్రామ సర్పంచ్ పద్మ యాదవ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, పర్వతగిరి పట్టణ మాజీ అధ్యక్షుడు కూసం రామచందర్, స్థానిక నాయకులు, మృతుల కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home