జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో సూపర్‌వైజర్ల పాత్ర కీలకం: డీఎంహెచ్ఓ డా. బి. రాజా రెడ్డి
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs), యూఎఫ్‌డబ్ల్యూసీలలో పనిచేస్తున్న పర్యవేక్షకులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, క్షేత్రస్థాయి పనితీరు, లక్ష్యాల సాధనపై సంబంధిత ప్రోగ్రాం అధికారులు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డా. బి. రాజా రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా చూడడంలో సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలి అని అన్నారు. సూపర్‌వైజర్లు నిరంతరం క్షేత్రస్థాయి సందర్శనలు నిర్వహిస్తూ ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తమ విధులను సకాలంలో, సమర్థవంతంగా నిర్వహించేలా ప్రోత్సహించాలని, అవసరమైన చోట సపోర్టివ్ సూపర్‌విజన్ అందించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో అందించిన ఆరోగ్య సేవలకు సంబంధించిన డేటాను సంబంధిత సిబ్బంది అదే రోజున సంబంధిత వెబ్‌సైట్లలో నమోదు చేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ సూచించారు. ప్రతి వారం డ్రై డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం, ఆశా కార్యకర్తల ద్వారా జ్వర సర్వే నిర్వహించడం, జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, చికిత్స అందించేలా చూడాలని ఆదేశించారు.
ఎంసీహెచ్ సేవలు, డేటా నమోదు
MCH పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ డేటాను రెండు రోజుల్లోగా పూర్తిగా అప్‌డేట్ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీలు, ప్రసవాలు, తల్లులు మరియు శిశువులకు సంబంధించిన సేవల డేటా సకాలంలో నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలి
క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంపై ప్రత్యేకంగా సమీక్షిస్తూ, క్షయ వ్యాధి అనుమానితులను ఎక్కువ సంఖ్యలో గుర్తించి స్పుటం పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి వ్యక్తికి సకాలంలో చికిత్స ప్రారంభించి, మందులు క్రమం తప్పకుండా అందేలా పర్యవేక్షించాలని సూచించారు.
అలాగే క్షయ వ్యాధికి సంబంధించిన పరీక్షలు, నిర్ధారణ, చికిత్స ప్రారంభం మరియు ఫాలోఅప్ వివరాలను సంబంధిత పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్య సాధన కోసం క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డా. సాజిదా, డా. ఇక్తిదార్ అహ్మద్, డీఎన్‌ఎంఓ డా. మానస శ్యామల, డీపీఓ అర్చన, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఎస్‌ఓ ప్రసన్న కుమార్, డీపీఎచ్ఎన్‌ఓ మనోజతో పాటు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల జిల్లా సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.