🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 30 Aug, 2026 | Page: 1

రాయపర్తి మండలంలో BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశం

భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో చేపట్టనున్న “కాంగ్రెస్ 1000 రోజులు పాలనపై – బీఆర్‌ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాల” కార్యాచరణపై రాయపర్తి BRS పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి *మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,* హాజరై ముఖ్య నాయకులతో సమావేశమై, రానున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
మండలంలోని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రతి గ్రామంలో కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. పార్టీ కార్యక్రమాల విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ విస్తృతస్థాయి సమావేశంలో మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home