🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 30 Aug, 2026 | Page: 1

కీ. శే.సంపెల్లి విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

కీ. శే.సంపెల్లి విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

*పాడెను మోసి చివరి వీడ్కోలు పలికిన*

* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమారస్వామి ,
* జర్నలిస్ట్ టీ డబ్ల్యూ జే ఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ళ దుర్గారావు

*జన చరిత్ర న్యూస్,పర్వతగిరి, ఆగష్టు 30 :*

పర్వతగిరి మండలం, వడ్లకొండ గ్రామానికి చెందిన సంపెల్లి విమలమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమారస్వామి , జర్నలిస్ట్ టీ డబ్ల్యూ జే ఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ళ దుర్గారావు ఆమె నివాసానికి చేరుకుని విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అంతిమయాత్రలో పాల్గొని స్వయంగా ఆమె పాడెను మోసి చివరి వీడ్కోలు పలికారు. విమలమ్మ మృతి పట్ల వారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
🏠 Home