🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 31 Aug, 2026 | Page: 1

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం

పోలీస్ డిపార్ట్మెంట్లో తమ సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవీ విరమణ చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నందు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సారమల్లు, ములుగు PS నందు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఇమ్మాన్యుయేల్ గార్లకు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ములుగు జిల్లా అడిషనల్ ఎస్పీ సదానందం గారు శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు*


ఈ కార్యక్రమంలో భాగంగా ములుగు సీఐ సురేష్ మాట్లాడుతూ 42 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ అనంతరం రిటైర్ అవుతున్న అధికారులు ఇద్దరు తమ కుటుంబాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారికి అవసరం వచ్చిన తమను సంప్రదించాలని తెలియజేశారు.


అనంతరం ఆర్ ఐ స్వామి మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పదని ఈరోజు పదవి విరమణ పొందుతున్న ఈ అధికారులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ములుగు జిల్లా పోలీస్ సంక్షేమ సంఘానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు క్రాంతికుమార్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఈరోజు పదవి విరమణ చేస్తున్న అధికారుల యొక్క బెనిఫిట్స్ అందే వరకు కూడా తమ కృషి చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

తదనంతరం ములుగు డిఎస్పి రవీందర్ గారు మాట్లాడుతూ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇద్దరు అధికారులు ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని నక్సరిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎంతో కష్టపడి పని చేసి ఈరోజు డిపార్ట్మెంట్ ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇలాంటి వారి కృషి వల్లే నేడు తెలంగాణ పోలీస్ అత్యుత్తమ విధులు కనబరుస్తున్నారని తెలియజేశారు. ఈరోజు పదవి విరమణ పొందుతున్న ఈ అధికారులు వారి కుటుంబాలతో ఆయురారోగ్యాలతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు.

అటు తర్వాత డిఎస్పి డిసిఆర్బి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది అని ఈ సుదీర్ఘ ప్రయాణంలో అధికారులకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. వారు పదవి విరమణ పొందిన తర్వాత కూడా అదే విధంగా తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు.

*అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ సదానందం గారు మాట్లాడుతూ* పోలీస్ కంట్రోల్ రూమ్ నందు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సారమల్లు, ములుగు PS నందు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఇమ్మాన్యుయేల్ గారు లు పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా సేవలందించి సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ విభాగంలో సుధీర్ఘ కాలంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సిబ్బంది సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని అన్నారు “ పోలీసు రిటైర్ మెంట్ కేవలం వారి వృత్తికే, కాని వారి వ్యక్తిత్వానికి కాదు” అని కొనియాడారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా,పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వహించినారు. పదవి విరమణ చేసిన పోలీసులు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.



ఈ కార్యక్రమంలో డి సి ఆర్ బి డీఎస్పీ కిశోర్ కుమార్, ములుగు డి.ఎస్.పి రవీందర్, ములుగు సీఐ సురేష్, ఆర్ఐ లు స్వామి, వెంకటనారాయణ, ములుగు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు క్రాంతి, పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home