ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రధాన లక్ష్యం -మహిళల భద్రత
*వరంగల్ లోని పాలిటెక్నిక్ కాలేజీలో -షీ టీమ్స్ , AHTU(యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ )మరియు భరోసా గురించి వరంగల్ క్రైమ్ ACP సదయ్య గారి అవగాహన సదస్సు.....*
నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య గారు అన్నారు. వరంగల్ లోని పాలిటెక్నిక్ కాలేజీ లో దాదాపు 250మంది విద్యార్థినిలతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య గారు మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాల పై,అవగహన కలిగివుండాలని మరియు మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అందరు *టీ-సేఫ్* ఆప్ ను ఉపయోగించుకోవాలని, *టీ-సేఫ్* ఆప్ పై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు తాము నివసించే ప్రదేశాలలో అయినా అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్టైతే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ1930 కి ఫిర్యాదు చేయాలని, మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సీపీ గారి వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మరియు AHTU నుండి సీఐ రమేష్ గారు,షీ టీమ్ ఎస్ ఐ స్వాతి గారు సిబ్బంది మరియు భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.