🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 31 Aug, 2026 | Page: 1

మల్లికార్జున్ కర్గే వేదికను శుద్ధి కరణ చేసిన చర్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
పర్వతగిరి: *రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ , వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు* ఆదేశానుసారం,
*వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీ చిలువేరు శీనన్న* పిలుపుమేరకు ఈ రోజు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నరుకుడు రవీందర్ గారి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యుడు శ్రీ మహేంద్ర భట్ గారిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు హల్ద్వానీలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం, BJP-RSSకు చెందిన కొందరు వ్యక్తులు ఆయన ప్రసంగించిన వేదికకు “శుద్ధీకరణ” చేశారు.
ఈ “శుద్ధీకరణ” చర్య కేవలం అత్యంత ఖండనీయమైన, సిగ్గుచేటైన ఆలోచనకు ప్రతీక మాత్రమే కాదు, మన రాజ్యాంగాన్ని, SC/ST చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా, చట్టపరమైన నేరం కూడా.
ఈ ఘటన జరిగి 20 రోజులు గడిచినా, ప్రధానమంత్రి మోదీ , ఆయన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి మోదీ కి నిజంగా మన దేశ రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, ఉత్తరాఖండ్‌లో ఈ నేరానికి పాల్పడిన వారిపై FIR నమోదు చేయించి, SC/ST చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకునేలా చూడాలి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిన్నింటి అనిల్ రావు, పర్వతగిరి గ్రామ సర్పంచ్ చీదురు శంకర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మాసాని సుధాకర్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లందాసు రంగయ్య, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బోట్ల కనకరాజు, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు కందికట్ల భాస్కర్, అన్నారం సర్పంచ్ మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేడ్ల సంతోష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్, రావూరు ఉపసర్పంచ్ కొమ్ము రమేష్, చీదురు తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
🏠 Home