తవేరా ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పరిధిలోని నేషనల్ హైవే 365పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకతీయ గురుకులం మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని తవేరా వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో నెక్కపేటకు చెందిన రాజేష్‌రావు అనే ద్విచక్ర వాహనదారుడి కాలు తీవ్రంగా గాయపడి నుజ్జునుజ్జయినట్లు తెలిసింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.