🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 31 Aug, 2026 | Page: 1

రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్‌ఐఆర్, ఖర్గేకు జరిగిన అవమానానికి నిరసనగా హనుమకొండలో కాంగ్రెస్ ధర్నా

హనుమకొండ:ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా డీసీసీ (DCC) అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సూచన మేరకు హనుమకొండ చౌరస్తాలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అక్రమంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.అదేవిధంగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా వేదికను "శుద్ధి" చేస్తున్నామనే నెపంతో, దళితుడైన ఆయనను తీవ్రంగా అవమానించిన బీజేపీ కార్యకర్తలపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, దళితులను అవమానించడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల, డివిజన్ అధ్యక్షులు, మీడియా కమిటీ చైర్మన్, అనుబంధ సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home