🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Sep, 2026 | Page: 1

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత- చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హిందూ స్మశానవాటికలో మొక్కలు నాటిన నాయకులు

వరంగల్, లేబర్ కాలనీ:
లేబర్ కాలనీలోని హిందూ స్మశానవాటికలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ విభాగం సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. 18, 19, 27, 16వ లేబర్ కాలనీ అబ్బని కుంట గాంధీ నగర్ డివిజన్లకు చెందిన పెద్దలు, నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ విభాగం ప్రశాంత్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలిగినా, ఆక్సిజన్ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు.

మామిడాల రమేష్ బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున లక్షలాది మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతోందని, ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటునిస్తూ విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని అన్నారు.

స్వర్గ రథం విరాళం

ఈ సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు లాకుం రవి హిందూ స్మశానవాటిక కోసం దాదాపుగా మూడు లక్షల రూపాయల పైబడిన స్వర్గ రథాన్ని విరాళంగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం స్మశానవాటిక అభివృద్ధిపై నాయకులు చర్చించారు. హిందూ స్మశానవాటిక అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం మరియు మౌలిక వసతుల మెరుగుదల కోసం అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

18, 19, 27, 16వ డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ మామిడాల రమేష్ బాబు, ప్రదాన కార్యదర్శి శ్రీ మూడేడ్ల సతీష్, ఉపాద్యక్షులు శ్రీ కుందారపు రాజేందర్ గారు, బేతి అశోక్ బాబు గారు, ముఖ్య సలహాదారు శ్రీ కుసుమ సత్య నారాయణ, కోశాదికారి శ్రీ అనుముల జనార్ధన్, సలహాదారులు శ్రీ గంట రమేష్, సభ్యులు, శ్రీ గడ్డమీది రాజేష్, శ్రీ బేతి మదన్ మోహన్, శ్రీ బేతి రాజు, శ్రీ కుడికాల శ్యామ్ ప్రసాద్, కాలనీ పెద్దలు బండి సత్యం, శ్రీ జోగు చంద్ర శేఖర్, శ్రీ బంక కుమారస్వామి, శ్రీ పోలు బిక్షపతి, శ్రీ కనుకుంట్ల రంజిత్, శ్రీ ఆవుల రమేష్, శ్రీ గుండా స్వామి, శ్రీ కుడికాల కుమార స్వామి, శ్రీ మామిడాల రాజారాం, యూత్ సభ్యులు శ్రీ దేవునూరి రాజు, శ్రీ బొడ్డు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home