బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనం - రాహుల్ గాంధీ గారిపై అక్రమ FIR"
రాహుల్ గాంధీ గారిపై FIR అంటే, రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై FIR
మేము భయపడము - 'డరో మత్' - మహిళా కాంగ్రెస్ పోరాడుతుంది
రాహుల్ గాంధీ గారిపై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి.
హల్ద్వానీలో శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నాం.
ఒక దళితుడు కూర్చున్న చోటును శుద్ధి చేస్తామనే నీచమైన బీజేపీ మనస్తత్వానికి వ్యతిరేకంగా నిలబడి, న్యాయం కోసం గొంతెత్తిన మన నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ కుట్రను తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు పిలుపునిచ్చారు.
అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు శ్రీ రాహుల్ గాంధీ గారిపై నమోదు చేసిన అక్రమ FIR ను ఖండిస్తూ, ఉత్తరాఖండ్ లో బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండీ నిరసన ప్రదర్శన చేస్తూ ర్యాలీగా వెళ్తున్న మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్ ఎదురుగా శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మన గౌరవ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు హల్ద్వానీలో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన కూర్చున్న ప్రదేశాన్ని బీజేపీ-ఆర్ఎస్ఎస్ నాయకులు గంగాజలంతో శుద్ధి చేశారు. ఇది సిగ్గుమాలిన చర్య! ఒక దళితుడు కూర్చుంటే ఆ ప్రదేశం అపవిత్రం అవుతుందా?
ఇదేనా మీ హిందుత్వం? ఇదేనా మీ సంస్కారం? ఇది ఖర్గే గారిని అవమానించడం కాదు, భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడం.
దీనిని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ధైర్యంగా ప్రశ్నించారు. నిందితులపై చర్య తీసుకోండి అని డిమాండ్ చేశారు. మరి ఉత్తరాఖండ్ లోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? నిందితులపై చర్య తీసుకోకుండా, న్యాయం కోసం మాట్లాడిన రాహుల్ గాంధీ గారిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇది ప్రజాస్వామ్యమా? ఇది నియంతృత్వం కాదా?
రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలని అడిగినప్పుడు కేసు, మా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగినప్పుడు కేసు, ఈ దేశ సంపదను దోచుకుంటున్న అదానీ గురించి ప్రశ్నించినప్పుడు కేసు!ఎందుకు? ఎందుకంటే ఆయన భయపడడు! ఆయన ఈ దేశ రాజ్యాంగం కోసం, మన ఆత్మగౌరవం కోసం నిక్కచ్చిగా నిలబడుతున్నాడు.. అందుకే మీకు ఆయనంటే భయం!
ఈరోజు రాహుల్ గాంధీ గారిపై ఎఫ్ఐఆర్ అంటే, రేపు మనందరిపై ఎఫ్ఐఆర్. మనం భయపడాలని బీజేపీ అనుకుంటోంది. కానీ మనము భయపడం. మనం మహిళా కాంగ్రెస్ మరియు ఇందిరా గాంధీ వారసులం. మనం పోరాడుతానే ఉంటాం.
రాహుల్ గాంధీ గారిపై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి మరియు హల్ద్వానీలో శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నాం.
ఈ నిరసన ఇక్కడితో ఆగదు! ఇది ఆరంభం మాత్రమే!మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు ఒకటే మాట చెప్పారు - "డరో మత్ - భయపడకు!" అని!అవును, మేము భయపడము! ఈ రాజ్యాంగం కోసం, ఈ దళితుల కోసం, మా మహిళల ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రామంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.