🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Sep, 2026 | Page: 1

వరంగల్ పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

హన్మకొండ పట్టణంలోని హంటర్ రోడ్డులో అదాల జంక్షన్ నుండి నీలిమ జంక్షన్ వరకు గల ప్రాంతంలో అనేక పాఠశాలలు మరియు కళాశాలలు ఉన్నాయి. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో వారి సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ఈ ప్రాంతంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ గారు, పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకన్న గారు, అలాగే ఆర్ అండ్ బి శాఖ అధికారులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు.పరిశీలన అనంతరం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం న్యూ సైన్స్ కాలేజ్‌కు కొంత దూరం తర్వాత ఉన్న మీడియన్ కటింగ్‌ను తాత్కాలికంగా, ప్రయోగాత్మక ప్రాతిపదికన మూసివేయడం జరుగుతుంది.కావున, వరంగల్ పట్టణ ప్రజలు మరియు వాహనదారులు ఈ మార్పును గమనించి ట్రాఫిక్ పోలీసు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.ప్రజలందరూ ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ ట్రాఫిక్ పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
🏠 Home