🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Sep, 2026 | Page: 1

రాహుల్ గాంధీపై కేసులు ఎత్తివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన :- డిసిసి అధ్యక్షుడు అయూబ్

*కాంగ్రెస్ పార్టీ పోరాటం వ్యక్తుల కోసం కాదు.. ప్రజాస్వామ్యం కోసం…*

*రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం మా పోరాటం..*

*ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేస్తే సహించబోం..*

*రాహుల్ గాంధీపై కేసులు ఎత్తివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన :- డిసిసి అధ్యక్షుడు అయూబ్ ..*


వరంగల్ / వెంకట్రామ జంక్షన్…
01 సెప్టెంబర్ 2026…


ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేసే ప్రయత్నాలను సహించబోమని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టడం సరికాదని వాటిని వెంటనే తొలగించి కాంగ్రెస్ పార్టీకి బిజెపి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ గారిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వెంకట్రామ జంక్షన్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నినాదాలు చేస్తూ, అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీ గారిపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు మాట్లాడుతూ…

“రాహుల్ గాంధీ గారు ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడిపై కేసులు నమోదు చేసి ఆయన గొంతును అణచివేయాలని చూడటం సరికాదు. ప్రశ్నించే గొంతును కేసులతో అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు” అని అన్నారు.

రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో, ప్రజాక్షేత్రంలో బలంగా వినిపిస్తున్నారని అయూబ్ గారు తెలిపారు. రైతులు, యువత, మహిళలు, పేదలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేక కేసుల పేరుతో రాహుల్ గాంధీ గారి గొంతును నొక్కాలని చూస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ గారిపై మాత్రమే జరుగుతున్న దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతి ఒక్కరి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది” అని అయూబ్ గారు స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కును ప్రభుత్వాలు గౌరవించాలని అన్నారు. అధికారంలో ఉన్న వారు విమర్శలను స్వీకరించి ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి తప్ప, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచకూడదని సూచించారు.

రాహుల్ గాంధీ గారిపై ఎన్ని కేసులు పెట్టినా ఆయన ఒక పతకం లెక్క భావిస్తా అన్నారు ఆయన ప్రజా పోరాటాన్ని ఆపలేరని అయూబ్ గారు అన్నారు. రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ పోరాటం వ్యక్తుల కోసం కాదు.. ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల కోసం. రాహుల్ గాంధీ గారి వెంట కాంగ్రెస్ పార్టీ బలంగా నిలుస్తుంది” అని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని, రాహుల్ గాంధీ గారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని అయూబ్ గారు డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ్ వెంకటరాజ్యం, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, వర్ధన్నపేట టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్,3, 14, 43వ డివిజన్ల అధ్యక్షులు జన్ను అరుణకర్, సయ్యద్ ఇంతియాజ్, మాడుగుల రాజు కుమార్, మాజీ మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, ఎద్దు సత్యం, ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల, యూత్ మహిళా,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ నాయకులు, మండల, టౌన్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
🏠 Home