🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Sep, 2026 | Page: 1

వర్ధన్నపేట లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ,బాకి కార్డుల పంపిణి - ధర్నా

వర్ధన్నపేట లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ,బాకి కార్డుల పంపిణి - ధర్నా కార్యక్రమం విజవంతం చేయండి*

* వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షులు
తూల్ల.కుమారస్వామి

*జన చరిత్ర న్యూస్ వర్ధన్నపేట , సెప్టెంబర్ 01:*

వర్ధన్నపేట మండల కేంద్రములో వివేకానంద విగ్రహం నుండి అంబెడ్కర్ విగ్రహం నుండి ప్రభుత్వ హాస్పిటల్ వరకు అక్కడ నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ,ధర్నా కార్యక్రమం
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు,వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట మండల కేంద్రంలో రేపు అనగా తేదీ 2.9.2026 రోజున ఉదయం 9.00గం,,లకు మండల కేంద్రంలో ర్యాలీ, బాకీ కార్డుల పంపిణీ, మరియు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షులు
తూల్ల.కుమారస్వామి తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు,420 హామీలు ఇచ్చి 100 రోజులలో నెరవేస్తామని చెప్పి 1000 రోజులైనా నెరవేర్చకపోవడంతో ఈ కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ చేపట్టడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ హాజరవుతున్నారు.
కావున మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, సర్పంచులు,మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘ నాయకులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ ముఖ్య కార్యకర్తలు,యువజన నాయకులు,మహిళలు, రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని మండల పార్టీ అధ్యక్షులు
తూల్ల.కుమారస్వామి తెలిపారు.
🏠 Home