🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Sep, 2026 | Page: 1

పాలన చేతకాక.. భౌతిక దాడులే కాంగ్రెస్ దిక్క?

సెప్టెంబర్ 1 (జన చరిత్ర):

బీజేపీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్ అసహనానికి పరాకాష్ట: *తుమ్మల మురళీధర్ రెడ్డి*

మోత్కూరు: మోత్కూరు మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముష్పట్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి నలుపు రంగు పూయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ముష్పట్ల గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. సొంత పార్టీలో సొంత నాయకుల మధ్య పంచాయతీలు, అంతర్గత కుమ్ములాటలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ కార్యాలయంపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తమ ఇంటి పంచాయతీలను తామే పరిష్కరించుకోవాల్సింది పోయి, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కార్యాలయంపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అసహనానికి, అవివేకానికి పరాకాష్ట అని తుమ్మల మురళీధర్ రెడ్డి విమర్శించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దాడులతో బీజేపీని భయపెట్టలేరని, ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరని స్పష్టం చేశారు.
బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మోత్కూరు మండల పార్టీ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు జితేందర్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు భీమిడి తిరుమలరెడ్డి, ఇటికాల పాండురంగాచారి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home