🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Sep, 2026 | Page: 1

హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో పదవీ విరమణ చేసిన ASI సర్వేశం ఘన సన్మానం

హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ASI సర్వేశం గారు తన సేవా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి 31.08.2026న పదవీ విరమణ చేశారు.

ఈ సందర్భంగా హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ గారు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పసుల సర్వేశం గారిని ఘనంగా సన్మానించి, శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాచ శివకుమార్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలకు సేవలందించిన పసుల సర్వేశం గారి సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని పసుల సర్వేశం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు
🏠 Home