🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Sep, 2026 | Page: 1

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
పర్వతగిరి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన *కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిన్నింటి అనిల్ రావు*
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చాయని గుర్తు చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్ అని కొనియాడారు.
“ప్రజల కోసం జీవించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బోట్ల మహేంద్ర, పర్వతగిరి ఉప సర్పంచ్ చింతకుంట్ల అనిత - రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కుసం రామచందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల కనకరాజు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పిన్నింటి సునీల్ రావు, నరెడ్ల సూరయ్య, కత్తుల ఐలయ్య, అతి కుమారస్వామి, చౌద సుధాకర్, పోకల శంకర్, చీకటి రాజేష్, మధుగాని శ్రీకాంత్, నరెడ్ల సంతోష్,బుద్దె రాకేష్, చీదురు తిరుపతి, బోట్ల వెంకటేశ్వర్లు, చిన్న పెళ్లి నిరంజన్, జనగం శ్రావణ్, పుల్లూరు సమ్మయ్య, ఎండి సుల్తానా, గూగులోతు భాస్కర్, భూక్యా రమేష్, అభిమానులు, యువత మరియు స్థానిక ప్రజలు పాల్గొని మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.
🏠 Home