వర్ధన్నపేట సీఐగా సంజీవరావు బాధ్యతల స్వీకరణ
వరంగల్: వర్ధన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సంజీవరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పోలీసు సేవలు అందిస్తామని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని,నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.