🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Sep, 2026 | Page: 1

కస్తూర్బా పాఠశాల సందర్శన తనిఖీలు నిర్వహించిన ఎంఈఓ, కాంప్లెక్స్ హెడ్మాస్టర్

జన చరిత్ర న్యూస్
పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ను ఈరోజు పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి మరియు పర్వతగిరి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కే నవీన్ కుమార్ కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తరగతి గది పాఠ్యాంశ బోధనను పరిశీలించారు, విద్యార్థులను సంబంధిత విషయాలపై ప్రశ్నలు అడిగారు. వంటశాల పరిసరాలను మరియు భోజన పదార్థాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల డైరీలు, ఎఫ్ ఎల్ ఎం రిజిస్టర్ లు, హాజరు రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఉచితంగా అందజేసిన స్కూల్ బ్యాగులను వారి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ స్పెషల్ ఆఫీసర్ నాజియా సల్మా సీ ఆర్ టి లు పాల్గొన్నారు.
🏠 Home