🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Sep, 2026 | Page: 1

టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళికి అసిస్టెంట్ రిజిస్టార్ గా పదోన్నతి మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగిళ్ళ మురళి

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ (టీఎన్జీవో) జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న నాగిళ్ల మురళికి పదోన్నతి లభించింది.
కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఇన్స్పెక్టర్ నుంచి అసిస్టెంట్ రిజిస్టర్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సేవకులుగా పనిచేస్తూ వారి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు, ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు"ప్రభుత్వ ఉద్యోగులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేపూరి నరసింహ చారి, టీఎన్జీవో మాజీ పూర్వ జిల్లా అధ్యక్షుడు ఏడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి జే.శేఖర్ రెడ్డి, మనోజ్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home