రేవంత్ రెడ్డి మాటలు..తుపాకీ రాముని మాటలు ఒక్కటే వాగ్దానాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణ/వరంగల్/పాలకుర్తి,సెప్టెంబర్ 2
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.హామీలను గుర్తుచేసేందుకే 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన,గ్రామాల్లో బాకీ కార్డుల పంపిణీ చేపట్టామని తెలిపారు.మహిళలకు నెలకు రూ.2,500,వృద్ధులు,బీడీ కార్మికులకు రూ.4 వేలు,దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్,రైతు భరోసా,రుణమాఫీ,పంటలకు బోనస్,రైతు కూలీలకు ఆర్థిక సాయం,నిరుద్యోగ భృతి,ఉద్యోగాల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు,కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లిన గత పాలనను పక్కనపెట్టి రాష్ట్రాన్ని మళ్లీ సమస్యల దిశగా తీసుకెళ్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.విద్యుత్,యూరియా,సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.ప్రజా సమస్యలపై ఉద్యమాలు,పోరాటాలు చేయడం బీఆర్‌ఎస్‌కు కొత్తేమీ కాదని,ప్రభుత్వం మెడలు వంచైనా ఇచ్చిన హామీలను అమలు చేయించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దేవరుప్పుల,కొడకండ్ల,పాలకుర్తి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ జిల్లా,మండల,గ్రామ,యువజన,సోషల్ మీడియా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.