🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 03 Sep, 2026 | Page: 1

దివ్యాంగులకు సేవలు చేస్తున్న సేవకులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి- వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ.


దివ్యాంగులకు సేవలు చేస్తున్న సేవకులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి- వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ.

వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి పూజ వరంగల్‌ కాశీబుగ్గలోని మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న మానసిక దివ్యాంగులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారికి పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, సమాజంలో ఆదరణ అవసరమైన మానసిక దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా దివ్యాంగులకు అందిస్తున్న సేవలను అభినందించారు.

మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా మానసిక వైకల్యంతో ఉన్న వ్యక్తులకు ఓర్పు, సహనం, ప్రేమతో నిస్వార్థ సేవలందిస్తున్న సిస్టర్స్‌ను న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. వారి అంకితభావం, సేవా స్ఫూర్తి ప్రశంసనీయమని అన్నారు. పట్ల ఎంతో ఓర్పు, సహనం మరియు ప్రేమతో సేవలందిస్తున్న సిస్టర్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వారి నిస్వార్థ సేవా భావం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు.

అక్కడి దివ్యాంగులతో కొంత సమయం గడపడం సంతోషంగా ఉందని, వారి అవసరాలను తెలుసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. “మానసిక దివ్యాంగుల జీవితాల్లో ఆరోగ్యం, ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సిస్టర్స్ చేస్తున్న సేవలకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని” అని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.శ్రీనివాస రావు, మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్ ఎల్వీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home