🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 03 Sep, 2026 | Page: 1

ఆర్‌ అండ్‌ బీ శాఖ పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో* ఆర్‌ అండ్‌ బీ శాఖ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ *మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి* గారు.
ఈ సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ *స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్,* సీఈలు బీవీ రావు, ధర్మారెడ్డి, రాజేందర్‌, నర్సింగా రావు, రాజేశ్వర్‌ రెడ్డి, వనజ తదితర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రోడ్లు, భవనాల అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్‌ పనులు, చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులు, పనుల నాణ్యత, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసే అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు, రాష్ట్రంలో రోడ్ల మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
🏠 Home