🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 03 Sep, 2026 | Page: 1

ఆదివారము జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం

యోగ అసోసియేషన్ ఆఫ్ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6 2026 రోజున గీతాంజలి డిగ్రీ కళాశాల నయీమ్ నగర్ హనుమకొండ యందు జిల్లాస్థాయి యోగాసన పోటీలు 8 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయస్కులకు మధ్య వివిధ కేటగిరీల వారీగా బాల బాలికలకు మహిళా పురుషులకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు పోటీలకు వచ్చేటప్పుడు జనన ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు మూడు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు వెంట తీసుకొని రావాలి. క్రీడాకారులు ఉదయము 9 గంటలకు గీతాంజలి డిగ్రీ కళాశాలలో రిపోర్ట్ చేయగలరు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో కరీంనగర్ లో జరిగే రాష్ట్రస్థాయి యోగసనల పోటీలలో పాల్గొంటారు. ఈ పోటీలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ క్రింది కాంటాక్ట్ నెంబర్లకు సంప్రదించగలరు బాల్నే శ్రీధర్ గారు 8341535657, గుగులోతు కిషన్ 9603909729,కుందే కిరణ్ 9392355556. ఈ కార్యక్రమంలో ఈ పోటీల రాష్ట్రస్థాయి పర్యవేక్షకులు వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు స్టేట్ యోగ వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి కమలాకర్ గారు మరియు యోగ అసోసియేషన్ అఫ్ హనుమకొండ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు బాల్నే శ్రీధర్ గారు మరియు కమలా కిషన్,వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గారు కైలాస్ గారు నిహారిక యాదవ్ గారు డాక్టర్ సూరం రాము తదితరులు పాల్గొన్నారు
🏠 Home