రాష్ట్ర స్వర్ణకార సంఘం బంద్‌కు పిలుపు కట్టా సత్యనారాయణ మృతికి నివాళిగా రేపు బంగారు దుకాణాలు బంద్
వరంగల్: స్వర్ణకార సంఘానికి విశేష సేవలందించిన ప్రముఖ స్వర్ణకార నాయకుడు కట్టా సత్యనారాయణ మృతి పట్ల రాష్ట్ర స్వర్ణకార సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి స్వర్ణకార సంఘానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు వింజమూరి రాఘవచారి పేర్కొన్నారు.
అఖిల భారత స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిగా కట్టా సత్యనారాయణ స్వర్ణకారుల సంక్షేమం కోసం ఎన్నో సేవలు అందించారని తెలిపారు. వరంగల్ విశ్వకర్మ ట్రస్ట్ బోర్డు భవన నిర్మాణంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
ఆయన చేసిన సేవలు స్వర్ణకారుల సమాజంలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని వింజమూరి రాఘవచారి అన్నారు. కట్టా సత్యనారాయణ అంత్యక్రియల్లో రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.
🚨 రేపు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారుల బంద్
దుకాణాలు పూర్తిగా మూసివేసి అంత్యక్రియల్లో పాల్గొనాలని పిలుపు
కట్టా సత్యనారాయణ మృతికి సంతాపంగా రేపు రాష్ట్ర స్వర్ణకార సంఘం బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని స్వర్ణకారులు తమ బంగారు దుకాణాలను పూర్తిగా మూసివేసి బంద్‌లో పాల్గొనాలని సంఘం నాయకులు కోరారు.
కట్టా సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు ఆకాంక్షించారు.