గుండు సుధారాణికి పద్మశాలి సంఘం నాయకుల శుభాకాంక్షలు
వరంగల్: బీసీ నాయకురాలు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి గుండు సుధారాణి ప్రభాకర్ KUDA చైర్మన్ పదవి లభించిన సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు ఆమెను కలిసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణికి చైర్మన్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె తన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు, ముఖ్యంగా బీసీ మరియు పద్మశాలి వర్గాల అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ వడ్నాల నరేందర్, పట్టణ అధ్యక్షులు డి.ఎస్. మూర్తి, యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్ బాబు, జిల్లా కార్యదర్శి గోరంట్ల రాజు, ఏకబ్రం, గుండు రవి, భద్రయ్య తదితర పద్మశాలి సంఘం నాయకులు పాల్గొని గుండు సుధారాణికి శుభాకాంక్షలు తెలిపారు.
గుండు సుధారాణి నాయకత్వంలో పద్మశాలి సమాజానికి మరింత గుర్తింపు, అభివృద్ధి మరియు సంక్షేమం సాధించాలని సంఘ నాయకులు ఆకాంక్షించారు.