🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 04 Sep, 2026 | Page: 1

డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కుడా ఛైర్మన్ గుండు సుధారాణి

హనుమకొండ: వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన శ్రీమతి గుండు సుధారాణి.. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హనుమకొండ రామకృష్ణ కాలనీలోని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె, ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.. కుడా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న గుండు సుధారాణికి శాలువా కప్పి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
🏠 Home