🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 04 Sep, 2026 | Page: 1

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన: బిఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ ఫ్లోర్ లీడర్:ఎంపీ రవిచంద్ర

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర గురువులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సుప్రసిద్ధ విద్యావేత్త,భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా 1962వ సంవత్సరం నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు.గొప్ప తత్వవేత్తగా పేరొందిన రాధాకృష్ణన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన మొట్టమొదటి భారతీయుడని,ఆంధ్రా,బనారస్ హిందూ విశ్వవిద్యాలయాల ఉప కులపతిగా పని చేశారన్నారు.సోవియట్ రష్యాలో భారత రాయబారిగా,ఉప రాష్ట్రపతిగా,రాష్ట్రపతిగా, విద్యావేత్తగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గాను ప్రభుత్వం నుంచి భారతరత్న పురస్కారాన్ని అందుకున్న రాధాకృష్ణన్ తెలుగు వాడు కావడం మనందరికి గర్వకారణం అన్నారు.విద్యార్థులకు ఉపాధ్యాయుడు మంచి ఆలోచనలు,క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన జీవన విధానం నేర్పించే మార్గదర్శి అని ఎంపీ రవిచంద్ర కొనియాడారు.ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని,గురువులను సమాజం గౌరవప్రదంగా చూస్తుందన్నారు."మాతృదేవోభవ","పితృదేవోభవ", "ఆచార్య దేవోభవ" అనే భావన మన భారతీయ సంస్కృతిలో ఇమిడి ఉందని, జన్మనిచ్చిన తల్లీదండ్రుల తర్వాత గురువునే గౌరవిస్తామని,పూజిస్తామని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.రాధాకృష్ణన్ విద్యకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారని "దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది"అని చెప్పారన్నారు.ఆయన జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వతేదీన పాఠశాలలు,కళాశాలలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సాంస్కృతిక కార్యక్రమాలు, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఆ మహనీయుడి జీవిత చరిత్రను చదివి స్ఫూర్తిపొంది ఉన్నతంగా ఎదగాల్సిందిగా విద్యార్థులు, యువతకు ఆయన హితవు పలికారు.రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరుతూ ఉపాధ్యాయులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home