తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 తారీకు రోజున ఖిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకుంటే తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 తారీకు రోజున ఖిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టుతా మని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి అన్నారు శనివారం రోజున ఉర్సులో జరిగిన సమావేశానికి మరుపల్ల రవి అధ్యక్షత వహించి మాట్లాడినారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా అర్హులైన ఉద్యమకారులకు 250 గజముల ఇంటి స్థలము ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్ ఉచిత వైద్య సౌకర్యములు కల్పిస్తామని పేర్కొని నేటికీ 1000 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో కొంతమంది జైలు జీవనం కేసులపాలై కోర్టుల చుట్టూ తిరిగి ఆర్ధిక స్తోమత లేక నేడు దుర్భర జీవనము కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు ఎన్నికల ముందు ఉద్యమకారు లకు లేనిపోని ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరించినారన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా కొంత మంది ఉద్యమకారులపై కేసులు నడుస్తున్నాయని వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రభుత్వం వెంటనే బే షరతుగా కేసులు ఎ త్తివేయాలని కన్వీనర్ మరుపల్ల రవి ప్రభుత్వంను డిమాండ్ చేశారు ఇట్టి సమావేశంలో ఉద్యమకారులు నాగవెల్లి సాంబయ్య మేకల ఎల్లయ్య అంకం దేవానంద్ కెంచ ఆనంద్ శంకేసి లింగమూర్తి బొద్దుల కుమార్ స్వామి బితవటం కనకరాజు కోడూరు నరేష్ మోక్ష సోమ మధుకర్ మాడిశెట్టి రాజ్ కుమార్ వేల్పుల కుమార్ స్వామి ఆవునూరు లక్ష్మి ముసినిపల్లి జమున కొడిపాక రమాదేవి చిదురాల సుజాత పల్లకొండ యాక లక్ష్మి సోమ ఉపేంద్ర కొండపాక లక్ష్మి తదితరులు ఉన్నారు