వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు..చర్యలు ఎప్పుడో?
*కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన దర్గా కమిటీ..అధికారుల తీరుపై అసంతృప్తి*
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 5*
ఖిలా వరంగల్ మండలం ఉరుస్ జాగీర్ గ్రామ పరిధిలోని హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా,మసీదుకు చెందిన వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ దర్గా కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించకపోవడంతో తాజాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.కమిటీ వివరాల ప్రకారం..సర్వే నంబర్లు 273,274,275,276లోని నోటిఫైడ్ వక్ఫ్ భూమిలో వక్ఫ్ బోర్డు నుంచి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు,లిఖితపూర్వక సమ్మతి,చెల్లుబాటు అయ్యే లీజు ఒప్పందం లేదా ఎన్‌ఓసీ లేకుండానే ఇళ్లు,షెడ్లు,వాణిజ్య నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.భారీ లోహ నిర్మాణాలతో షెడ్లు,ఇతర కట్టడాలు ఏర్పాటు చేయడంతో వక్ఫ్ ఆస్తికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.వక్ఫ్ భూమిలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను సమగ్రంగా పరిశీలించి,నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే వాటిని తొలగించి,బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
*ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపణ*
ఈ వ్యవహారంపై ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని దర్గా కమిటీ సభ్యులు ఆరోపించారు.నిర్మాణాలు చాలా రోజులుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం,సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కమిటీ డిమాండ్ చేసింది.అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే తొలగించి,బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది.ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్,సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.