🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 05 Sep, 2026 | Page: 1

మన ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా భారీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు

ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున మీరందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నా జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సేవా కార్యక్రమంతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నాను.

మన ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా భారీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం హనుమకొండ సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఉదయం 10:00 గంటలకు, పరకాల స్వర్ణ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10:30 గంటలకు, గుడెప్పాడు లోని NSR కన్వెన్షన్ హాల్ లో ఉదయం 11:30 గంటలకు, మరియు గీసుగొండలో, పద్మావతి ఫంక్షన్ హల్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం అవుతుంది.

మనమిచ్చే ఒక్క యూనిట్ రక్తం అత్యవసర స్థితిలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. అందుకే నా పుట్టినరోజున నాకు ఇచ్చే అతిపెద్ద బహుమతి మీరు చేసే రక్తదానమే! నా పిలుపును అందుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు మరియు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో మీకు దగ్గరలోని శిబిరానికి వచ్చి రక్తదానం చేయాలని, ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

వెంకట్రామ్ రెడ్డి
అధ్యక్షులు, హనుమకొండ DCC.
🏠 Home