🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 05 Sep, 2026 | Page: 1

పర్వతగిరిలో విద్యుత్ కోతలతో ప్రజల అవస్థలు

మూడు రోజులుగా సాయంత్రం 7 గంటలకే కరెంట్ కట్‌... 8–40 నిమిషాల పాటు సరఫరా నిలిపివేత
- ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు ఎన్నిసార్లు కరెంట్ పోతుందో గ్రామ ప్రజలకే తెలుసు!
,*గ్రామ లైన్మెన్ ని విధుల నుంచి తక్షణమే తొలగించాలి** *సొంత గ్రామంలో నిధులు నించడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని* *గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి:
పర్వతగిరి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో 8.00 నుంచి 40 నిమిషాల లైన్ మాన్ ఫోన్ ద్వారా సమాచారం అడగగా దౌర్జన్యం చేస్తున్నాడు విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతటితో సమస్య ముగియడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు ఎన్నిసార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందో లెక్కపెట్టడం కూడా కష్టంగా మారిందని అంటున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గృహ అవసరాలతో పాటు చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కోతలపై అధికారులను ప్రశ్నిస్తే విలేకరులు ప్రశ్నిస్తే గంట నలభై నిమిషాలు కోత విధించడం ఉన్నంత అధికారులని దాటివేస్తున్నారు ఒక్కోసారి ఒక్కో రకమైన సమాధానం ఇస్తున్నారని, అసలు కారణం ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు పొంతనలేని సమాధానాలతో తప్పించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సాంకేతిక సమస్య ఏమిటి? నిర్వహణ పనులా? లేక అనధికారిక విద్యుత్ కోతలా? అనే ప్రశ్నలు గ్రామస్థుల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి పర్వతగిరిలో గత మూడు రోజులుగా జరుగుతున్న విద్యుత్ అంతరాయాలపై పూర్తి వివరాలు వెల్లడించి, తరచూ విద్యుత్ నిలిచిపోవడానికి గల కారణాలను ప్రజలకు స్పష్టం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే విద్యుత్ సరఫరా అంతరాయాలను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పర్వతగిరి గ్రామంలో కరెంట్ లైన్ మెన్ విధులను నిర్వహిస్తున్న గ్రామాలలో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కరెంటు స్తంభంఎక్కడం రాదు ప్రైవేటు వ్యక్తుల ద్వారా పని చేయించుకొని రైతుల నుండి అధిక డబ్బులను వసూలు చేస్తున్న వైనం సొంత గ్రామంలో ఏం చేయరు అనే కోణంలో ఉన్న వ్యక్తిఅధికారుల అండదండలు ప్రజాప్రతిని అండదండలతో వ్యవహరిస్తున్న తీరు తక్షణమే వీధిలో నుంచి తొలగించి కొత్తవారిని నియమించాలని గ్రామ రైతులు ప్రజలు కోరుతున్నారు
🏠 Home