🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 06 Sep, 2026 | Page: 1

నిరుపేద విద్యార్థినికి MBBS సీటు : ఆర్థిక కారణాలతో దాతల సాయం కోసం ఎదురుచూపు!

చౌటుప్పల్: తంగడపల్లి గ్రామానికి చెందిన ఉబ్బు నర్మద నీట్ అర్హత పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ తండ్రి మరణం, తల్లి అనారోగ్యం,ఒకవైపు ఆర్థిక కారణాలతో కుటుంబ పోషణ, ముగ్గురు ఆడ పిల్లల చదువు ఇలా ఎన్నో సమస్యలతో,
ఆ కుటుంబం పుట్టెడు కష్టాల్లో ఉంది.మా అమ్మ ఆరోగ్యం సహకరించక పోయినా,విధి లేని పరిస్థితుల్లో కూలీ పనితో కుటుంబాన్ని పోషిస్తూ, ముగ్గురు అక్కా చెల్లెల్లను చదివిస్తుందని, కానీ ఎంబిబిఎస్ చదివించేంత స్తోమత తన తల్లికి లేదని, కానీ డాక్టర్ కావాలనే ఆశ ఉందని విద్యార్థిని కన్నీటి పర్యంతమయ్యారు. నీట్ శిక్షణ నిమిత్తం అపోలో మెడికల్ అకాడమీ యాజమాన్యాన్ని సంప్రదించగా డైరెక్టర్ పొసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ అల్వాల మధుసూదన్ ,లాంగ్ టర్మ్ శిక్షణ లో తమ వంతు సాయం అందించారని, అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి, ఉత్తమ బోధన అందించారని,వారి నమ్మకాన్ని నిలబెట్టి నీట్ పరీక్షలో అర్హత పొంది ఎంబీబీఎస్ సీటు సాధించానని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అపోలో మెడికల్ కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అల్వాల మధుసూదన్ విద్యార్థినికి అభినందలు తెలియజేయారు, అలాగే భవిష్యత్తు చదువు కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే దాతృత్వం గల వారు కూడా ముందుకు వచ్చి నిరుపేద విద్యార్థినికి సాయం అందించి అండగా నిలవాలని కోరారు. విద్యార్థిని తల్లి మాట్లాడుతూ.... దాతృత్వం గల వారు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందించాలని వేడుకుంటున్నారు.సాయం చేయదలచినవారు 9177776270, మరియు 9603272908 నెంబర్ లకి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించగలరని కోరారు.
🏠 Home