🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 06 Sep, 2026 | Page: 1

స్టేషన్లో మర్చిపోయిన నగదు బ్యాక్ అందజేత

06-09-2026 ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన రత్నాల రాజేశ్వరి W/o రామచంద్రుడు వయస్సు-76 సంవత్సరాలు, వయోవృద్ధురాలు. హనుమకొండ లోని తమ బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి పలాస రైల్వే స్టేషన్ నుండి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్‌లో దిగిన ఆమె, పొరపాటున ప్లాట్‌ఫారమ్ నంబర్ 3 వద్ద తన యొక్క లగేజ్ బ్యాగ్‌ను మర్చిపోయి వెళ్లిపోయారు. విధుల్లో ఉన్న RHC రవీందర్ GRP సిబ్బంది కమలాకర్, పాషా మరియు RPF HC శ్యామ్ సురేష్ లు ఆ బ్యాగ్‌ను గమనించి తనిఖీ చేశారు. ఆ తనిఖీలో అందులో రూ. 36,480 నగదు మరియు బట్టలు ఉన్నట్లు గుర్తించి వెంటనే IRP వరంగల్ శ్రీ వి నరేష్ కుమార్ గారికి సమాచారం ఇచ్చి వారి సూచనలు మేరకు రాజేశ్వరి గారికి సమాచారం అందించగా,కొంత సమయం తర్వాత ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి RPS వరంగల్ కార్యాలయానికి రాగ IRP V. నరేష్ కుమార్ గారి ఉత్తర్వుల మేరకు నగదు మరియు బట్టల బ్యాగ్‌ను రత్నాల రాజేశ్వరి గారికి అప్పగించడం అయినది.
🏠 Home