టీచర్స్ డే సందర్భంగా 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
వరంగల్: టీచర్స్ డే సందర్భంగా వరంగల్ జిల్లాలో అంకితభావం, నిబద్ధత, సేవా తత్పరతతో పనిచేస్తున్న వివిధ పాఠశాలలకు చెందిన 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.
హంటర్ రోడ్‌లోని PRR కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఉదయం రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఎంతో ఘనంగా, విజయవంతంగా జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షులు సోమ వేణు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, ప్రశంసాపత్రాలతో ఘనంగా అభినందించారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష సేవలు అందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని కార్యక్రమంలో పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వివిధ వృత్తి నిపుణుల పాత్ర ఎంత ముఖ్యమో, వారిని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పాత్ర అంతకంటే ఎంతో విలువైనదని తెలిపారు.
ఒక విద్యార్థి జీవితానికి తల్లిదండ్రులు పునాది అయితే, ఆ జీవితానికి సరైన దిశను చూపించే మార్గదర్శి గురువు అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి, మానవతా భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించడం ద్వారా మరింత మంది ఉపాధ్యాయులు సేవా స్ఫూర్తితో పనిచేసేందుకు ప్రేరణ పొందుతారని రోటరీ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా సన్మానం పొందిన 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
సమాజానికి తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని రోటరీ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పొన్న హరినాథ్, తోట సంపత్, బేతిశంకర్ దేవ, మహేందర్, కోరే చంద్రమొగిలి శ్రీనివాస్ తదితర రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.