🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 06 Sep, 2026 | Page: 1

నిజాయితీ, నిష్పక్షపాత వార్తలతో ప్రజల పక్షాన నిలవాలి: ఈగ మల్లేశం

వరంగల్ పట్టణంలోని లేబర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన M1 TV చానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి M1 TV కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం

👉ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... నిజాయితీ, నిష్పక్షపాత వార్తలతో ప్రజల పక్షాన నిలవాలని, సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నిరంతరం ఒక బలమైన వారధిగా నిలవడమే నిజమైన జర్నలిజం అని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ సరికొత్త సాంకేతికతను జోడించుకుంటూ, నిజాయితీ గల వార్తలతో, నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలిచినప్పుడే ఏ మీడియా సంస్థ అయినా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోగలదని తెలిపారు.

👉సమాజంలో వెనుకబడిన, తాడిత పీడిత అట్టడుగు వర్గాల ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా పత్రికలు, మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిజాయితీ గల వార్తలతో M1 TV చానల్ ప్రజల ఆదరణను చూరగొనాలని, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతూ, సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న 'M1 TV ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతం చానల్ సీఈవో అమరేంద్ర చారి, ఎండి బేతి అశోక్, బేతి రాజు గార్లు ముఖ్య అతిథి ఈగ మల్లేశం గారిని శాలువా మరియు మెమంటో తో ఘనంగా సత్కరించారు.

👉ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యనారాయణ, గడ్డం భాస్కర్, చిప్ప వెంకటేశ్వర్లు, పోతన వెంకటేశ్వర్లు, మామిడాల రమేష్ బాబు, బంక కుమారస్వామి, కరుణాకర్, వేణు, ప్రసాద్, రాజు, శ్రీధర్, పవన్, మనోహర్, రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home