ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పఠానీ సూట్లు
*పేద విద్యార్థులకు 60 పఠానీ సూట్లు పంపిణీ*
ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వరంగల్ ఆధ్వర్యంలో పేద,నిరుపేద విద్యార్థులకు పఠానీ సూట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పెన్షన్‌పురాలోని మదర్సా మదీనతుల్ ఉలూమ్‌కు చెందిన 35 మంది పేద విద్యార్థులకు,మండి బజార్‌లోని మదర్సా అరబియా ఖైరుల్ ఉలూమ్‌కు చెందిన 25 మంది అర్హులైన విద్యార్థులకు పఠానీ సూట్లును పంపిణీ చేశారు.పేద,అర్హులైన విద్యార్థులకు అండగా నిలిచే కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు.వరంగల్‌లోని మరో 12 అరబిక్ మదర్సాలకు చెందిన పేద విద్యార్థులకు కుర్తా,పైజామాలు పంపిణీ చేసేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వరంగల్ అధ్యక్షుడు మహమ్మద్ సిరాజ్ అహ్మద్,కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ కలీం,ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మిర్జా ఫతా ఉల్లా బేగ్,మదర్సా మదీనతుల్ ఉలూమ్ పెన్షన్‌పురా కార్యదర్శి మహమ్మద్ జాఫర్,మదర్సా ఖైరుల్ ఉలూమ్ నాజిమ్ ఖ్వాజా జాఫర్ ఉల్ అభిదీన్,ఉపాధ్యాయుడు ఖ్వాజా పాషా తదితరులు పాల్గొన్నారు.విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు
ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలు,నిరుపేదలు,అర్హులైన వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి నెల 516 మంది వితంతువులకు పింఛన్లు అందించడంతో పాటు పేద రోగులకు వైద్య సహాయం,అర్హులైన విద్యార్థులకు విద్యా సహాయం,ఉర్దూ మీడియం పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ,పేద బాలికల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.రంజాన్ మాసంలో అర్హులైన కుటుంబాలకు రేషన్ ప్యాకేజీల పంపిణీతో పాటు అరబిక్ మదర్సాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పాఠశాల దుస్తులను అందిస్తున్నట్లు తెలిపారు.ఫ్యాషన్ డిజైనింగ్,బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమాలతో పాటు పేద విద్యార్థినుల కోసం గర్ల్స్ హాస్టల్ సదుపాయాన్ని కూడా సొసైటీ కల్పిస్తోందన్నారు.సొసైటీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించేందుకు దాతలు,సేవాభావం కలిగిన వ్యక్తులు ఉదారంగా ఆర్థిక సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు.సహాయం,ఇతర వివరాల కోసం 9849325271,9849449486 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.