తెల్లదొరలను గడగడలాడించిన ‘తెలుగు వీరనారీమణులు
భారత స్వాతంత్య్ర సంగ్రామం… రక్తంతో లిఖించిన యోధుల చరిత్ర! ఈ చరిత్ర పుటల్లో పురుషుల పౌరుషంతో పాటు, తమ మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధపడిన వీరనారీమణుల త్యాగాలు కూడా అంతే ఉజ్జ్వలంగా వెలిగాయి. ముఖ్యంగా తెలుగు నేల సృష్టించిన ఆ వీరవనితల వీరత్వం బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను పెకిలించి వేసింది.
అనేక రకాల కట్టుబాట్లు ఉన్నప్పటికీ వాటికి ఎదురీది పోరాడారు తెలుగు వీరనారీమణులు! పసిపాపలను చంకన పెట్టుకుని జైలు గోడలను ముద్దాడారు! తెల్లదొరల తుపాకీ తూటాలకు గుండెలను ఎదురొడ్డి ‘వందేమాతరం’ అని గర్జించారు.
మహాత్మా గాంధీ పిలుపుతో దేశమంతటా స్వాతంత్య్ర కాంక్ష రగులుతున్న తరుణమది. ఆంధ్రదేశంలో ఆ ఉద్యమ శంఖారావాన్ని పూరించిన తొలి మహిళా యోధురాలు ‘దువ్వూరి సుబ్బమ్మ’! సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె, బహిరంగ సభల్లో వేలాది మందిని ఉత్తేజపరిచారు. ఉప్పు సత్యాగ్రహంలో ముందుండి నడిచి, బ్రిటిష్ వారిచే అరెస్ట్ అయ్యి, జైలు శిక్ష అనుభవించిన తొలి తెలుగు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇక పోరాటమంటే కేవలం వీధుల్లోకి రావడం మాత్రమే కాదు, త్యాగం కూడా అని నిరూపించారు ‘పొణకా కనకమ్మ’. నెల్లూరులో గాంధీజీని కలిసినప్పుడు, దేశసేవ కోసం తన ఒంటిపై ఉన్న స్వర్ణాభరణాలన్నింటినీ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ఆమె! మహిళల్లో దేశభక్తిని, చైతన్యాన్ని రగిలించడానికి ‘కస్తూరిబా దేవి విద్యాలయాన్ని’ స్థాపించి, ఎందరో మహిళలను స్వాతంత్య్రోద్యమం వైపు నడిపించారు కనకమ్మ.
విదేశీ వస్తువులను బహిష్కరించాలనే పిలుపుతో, ఆంగ్లేయుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి తెలుగు మహిళలు నడుం బిగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ‘కల్లూరి తులసమ్మ’ నాయకత్వంలో వేలాది మంది మహిళలు కల్లు దుకాణాల వద్ద, విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్ నిర్వహించారు. బ్రిటిష్ పోలీసుల లాఠీలకు, బెదిరింపులకు వెరవక, ధైర్యంగా పోరాడి జైలుకు వెళ్లారు.
తమిళనాడులో సుప్రసిద్ధులైన రాజగోపాలాచారి (రాజాజీ) నాయకత్వంలో జరిగిన వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక ప్రముఖ తెలుగు మహిళ డాక్టర్ రుక్మిణీ లక్ష్మీపతి. ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు గాను బ్రిటిష్ వారిచే అరెస్ట్ అయి, శాసనోల్లంఘన ఉద్యమంలో జైలుకు వెళ్లిన భారతదేశపు తొలి మహిళా సత్యాగ్రాహిగా ఈమె చరిత్రకెక్కారు. సైమన్ కమిషన్ బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా తదితర స్వాతంత్య్రోద్యమాల్లో చురుగ్గా పాల్గొని, పసిపాపను చంకన పెట్టుకుని మరీ బ్రిటిష్ పాలకులు విధించిన జైలు శిక్షను అనుభవించారు. ఇక మరొక యోధురాలు గుంటూరుకు చెందిన భారతీదేవి రంగా (ఎన్జీరంగా సతీమణి). మహిళలకు రైఫిల్ (తుపాకీ) శిక్షణ ఇవ్వడంలోనూ ఈమె ముందున్నారు.
మరొక మహిళా ఉద్యమకారిణి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. ఈమె ‘మాలపల్లి’ నవలా రచయిత అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య. గుంటూరులో ‘శారదా నికేతన’ స్థాపించి, ఉద్యమకారుల పిల్లలకు విద్యతో పాటు దేశభక్తిని నూరిపోశారు. పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు.
వీరందరూ నేటి తరం మహిళలకు నిరంతర స్ఫూర్తి! వారి వీరోచిత పోరాటం వల్లే నేడు మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాము. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ… వారి స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం.