నూతన ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తండు సైదులు గౌడ్
ప్రతినిధి : నల్గొండ నియోజకవర్గం: కనగల్ మండల కేంద్రంలో కనగల్ మండలం మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి BRS రాష్ట్ర నాయకులు, మాజీ జడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ యజమాని నర్సింగ్ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ పెట్రోల్ బంక్ అభివృద్ధి చెందాలని, వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని డా. తండు సైదులు గౌడ్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అయితగోని జనార్దన్ గౌడ్ ఇంతలా విజయ్ శేఖర్ వెంకటేశ్వర్లు రవి నాగరాజు రవీందర్ ప్రసాద్ కిషోర్ మహిళలు స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.