🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 07 Sep, 2026 | Page: 1

న్యాయం జరగకపోతే సచివాలయం ముట్టడి, హైకోర్టులో రిట్ పిటిషన్: JAC రాష్ట్ర కార్యదర్శి బోల్గురి ముకేష్ హెచ్చరిక

నల్గొండ జిల్లా కొతులారం MPPS పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM) తోటి ఉపాధ్యాయుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు, FRS హాజరు అక్రమాలు, నిధుల గోల్‌మాల్ మరియు విద్యార్థుల పట్ల అనాగరిక ప్రవర్తనకు పాల్పడిన విచారణలో రుజువైనప్పటికీ సదరు HMని కాపాడేందుకు నల్గొండ DEO కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ కార్పొరేట్ విద్య నియంత్రణ JAC & చరణ్యా శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (DSE) కార్యాలయం ముందు ధర్నా, ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ నవీన్ నికోలస్ IAS గారు విదేశీ పర్యటనలో ఉన్నందున కార్యాలయం ముందు నిరసన తెలిపిన అనంతరం, కార్యాలయ అడిషనల్ డైరెక్టర్ (AD) గారిని కలిసి సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన AD గారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 13న (13.09.2026) డైరెక్టర్ గారు విదేశీ పర్యటన నుండి తిరిగి వస్తారని, వచ్చిన వెంటనే ఈ విషయాన్ని డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు మరియు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాన డిమాండ్లు:
* శాశ్వత డిస్మిస్: ఫోర్జరీ, FRS దుర్వినియోగం, నిధుల కుంభకోణానికి పాల్పడిన కొతులారం MPPS HMను వెంటనే ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ (Dismiss) చేయాలి.
* క్రిమినల్ కేసులు & అరెస్ట్: తోటి ఉపాధ్యాయుల సంతకాలు ఫోర్జరీ చేసినందున సదరు HMపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
* DEO పై శాఖాపరమైన విచారణ: విచారణ అధికారుల రిపోర్టులను తులనాడి, నిందితుడిని కాపాడిన నల్గొండ DEO గారిపై తక్షణమే శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు ఇవ్వాలి.
న్యాయం జరగకపోతే సచివాలయం ధర్నా, హైకోర్టులో రిట్ పిటిషన్:
DSE ఆఫీస్ ముట్టడి తర్వాత కూడా ఉన్నతాధికారులు స్పందించకపోతే, తదుపరి చర్యగా తెలంగాణ సచివాలయం (Secretariat) ముట్టడి / ధర్నా చేపడతామని నేతలు హెచ్చరించారు. అంతేకుండా, ప్రాథమిక విచారణ నివేదికను పక్కనపెట్టిన DEO చర్యలపై, హెచ్‌ఎమ్ అక్రమాలపై తెలంగాణ హైకోర్టులో 'రిట్ పిటిషన్' (Writ Petition) దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో JAC రాష్ట్ర కార్యదర్శి బోల్గురి ముకేష్, JAC రాష్ట్ర నాయకులు, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర నాయకురాలు, హైకోర్ట్ అడ్వకేట్ మరియు పలు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
🏠 Home