🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 08 Sep, 2026 | Page: 1

“జై శ్రీరామ్”(J.S.R )రైస్ బస్తాల్లో పీడీఎస్ బియ్యం రీప్యాకింగ్!

పేదల బియ్యానికి పాతర – హసన్‌పర్తిలో రీప్యాకింగ్ ముఠా గుట్టురట్టు
56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం – ఇద్దరు అరెస్టు
రూ.2.07 లక్షల విలువైన బియ్యం, యంత్రాలు స్వాధీనం

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, “జై శ్రీరామ్” తదితర కమర్షియల్ రైస్ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్ చేసి, కమర్షియల్‌గా విక్రయిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి నిర్వహించింది. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి డంపింగ్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు హసన్‌పర్తి పరిధిలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్‌పై టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. దాడిలో మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 64 బస్తాలు × 50 కిలోలు (32 క్వింటాళ్లు), 106 బస్తాలు × 25 కిలోలు (24 క్వింటాళ్లు) ఉన్నాయి. బియ్యం మార్కెట్ విలువ సుమారు ₹1,96,000/- గా అంచనా వేశారు. విచారణలో నిందితులు హసన్‌పర్తి మండల పరిసర ప్రాంతాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, “జై శ్రీరామ్” తదితర కమర్షియల్ రైస్ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్ చేసి వివిధ దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. బియ్యాన్ని బరువు కొలిచేందుకు ఉపయోగిస్తున్న వెయింగ్ మెషిన్ (₹6,000/-), బస్తాల్లో బియ్యాన్ని నింపి కుట్టేందుకు ఉపయోగిస్తున్న రైస్ బ్యాగ్ స్టిచింగ్ మెషిన్ (₹5,000/-) ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బియ్యం మరియు యంత్రాలతో కలిపి మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ ₹2,07,000/-.

పట్టుబడిన నిందితులు

1. కాశబోయిన మొగిలి, తండ్రి: లింగయ్య, వయస్సు: 50 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: బోర్నపల్లి, హుజూరాబాద్ మండలం.

2. బెజ్జంకి శ్రీనివాస్, తండ్రి: మొగిలి, వయస్సు: 56 సంవత్సరాలు, నివాసం: కమలాపూర్.

పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యం మరియు ఇతర సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు.

పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం, రవాణా చేయడం, నిల్వ ఉంచడం, రీప్యాకింగ్ చేయడం, కమర్షియల్‌గా విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ బృందం కఠిన చర్యలు కొనసాగిస్తోంది.

ఎ. మధుసూదన్, ACP, టాస్క్ ఫోర్స్
బండారి రాజు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
B. ఉప్పలయ్య, SI ఆఫ్ పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ బృందం
🏠 Home